Site icon Prime9

రాజన్నసిరిసిల్ల జిల్లా : ఓ కేటీఆర్ దొర నిన్ను కూడా త్వరలోనే ఓడిస్తాం.. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

KTR

KTR

Rajanna Sirisilla District : మంత్రి కేటీఆర్ ఇలాకాలో ఆయనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు వెలిసాయి. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో, ఎంపిడివో కార్యాలయాల వద్ద కేటీఆర్ ఫోటోలతో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోసకారి కేటీఆర్ అంటూ ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థుల పేరిట ప్లేక్సీలు వెలిసారు.

ఇలా విద్యార్థులకు ద్రోహం చేసిన మంత్రి కేటీఆర్ బలపర్చిన టీఆర్ఎస్ సెస్ అభ్యర్థిని ఓడించి రిటర్న్ గిప్ట్ ఇస్తాం.మోసం చేసిన కేటీఆర్ కు తగిన బుద్ది చెబుతామంటూ హెచ్చరించారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు మరిచిపోవడంతో బడుగు బలహీన, గిరిజన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. మా గోస నీ పార్టీకి, ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది అంటూ ప్లెక్సీలో పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల ప్రజలారా మీ సమస్యలు తీరాలంటే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించాలని సూచించారు. ఓ కేటీఆర్ దొర నిన్ను కూడా త్వరలోనే ఓడిస్తామంటూ ప్లెక్సీ సాక్షిగా హెచ్చరించారు.

Exit mobile version