Site icon Prime9

KTR in Metro: హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్

KTR in Metro

KTR in Metro

KTR in Metro: ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.

సెల్ఫీల కోసం పోటీలు..(KTR in Metro)

ఈ సందర్భంగా కేటీఆర్ మెట్రో ప్రయాణికులతో మాట్లాడి ప్రస్థుత రాజకీయ పరిస్థితులని అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులు కేటిఆర్‌తో సెల్ఫీలు దిగటానికి పోటీపడ్డారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ప్రాముఖ్యతపై చర్చించిన కేటీఆర్ ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్బంగా పలువురు యువతీ యువకులు కేటీఆర్ తో తమ కెరీర్ గురించి,తమ అనుభవాల గురించి ముచ్చటించారు.

ఇలా ఉండగా ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉందామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్ పార్టీ రానున్న 4, 5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ప్రచారం వల్ల ఓటర్లు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

 

Exit mobile version