Site icon Prime9

KTR Tweet on Congress: వేలాది తెలంగాణ బిడ్డ‌ల్ని చంపిన బ‌లిదేవ‌త ఎవ‌రు?: కేటీఆర్

KTR Tweet on congress

KTR Tweet on congress

KTR Tweet on congress: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదిక‌గా మ‌రోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ప‌దేళ్లు తాత్సారం చేసి వంద‌లాది మంది ఆత్మ‌బ‌లిదానానికి కార‌ణం ఎవరు? 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం. 1969-71 తొలిదశ ఉద్య‌మంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి చెప్పారు..(KTR Tweet on Congress)

అలాగే దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలిపారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?” అని ప్ర‌శ్నిస్తూ అమ‌ర‌వీరుల స్తూపం ఫొటోను పోస్ట్ చేశారు.

మరోవైపు ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రోగులతో పాటు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది కూడా అవస్థలు పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోగులకు, డాక్టర్లకు ఆహారం అందటం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికా కథనాన్ని ఆయన తన ట్వీట్‌లో అటాచ్ చేశారు.

 

Exit mobile version