KTR Comments: కారు షెడ్డుకు వెళ్లలేదు .. సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళింది.. కేటీఆర్

భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు.

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 04:56 PM IST

KTR Comments: భువనగిరి పార్లమెంట్ నేతల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు షెడ్డుకు వెళ్లలేదు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్నారు. పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.. ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అంగీకరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయామని, దీనికి కూడా పూర్తి బాధ్యత తనదేనని కెటిఆర్ అన్నారు. నియోజవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని కేటీఆర్ అంగీకరించారు.

వోటరుకు, కార్యకర్తకు లింకు తెగింది..(KTR Comments)

ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల వోటరుకు కార్యకర్తకు లింకు తెగిందని కేటీఆర్ విశ్లేషించారు. కొత్త రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలోకి తీసుకు పోలేక పోయామని కెటిఆర్ అన్నారు. దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు వోపికపట్ట లేక అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారని కెటిఆర్ వివరించారు. ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందని కేటిఆర్ చెప్పారు. రైతుబంధు తీసుకున్న సామాన్య రైతుకూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇస్తే వొప్పుకోలేదని కెటిఆర్ తెలిపారు.ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదని, పార్టీ నాయకులు ఇకనుంచి అలా మాట్లాడకూడదని కేటీఆర్ హితవు పలికారు. రెండు సార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలేనని కెటిఆర్ గుర్తు చేశారు. ప్రతిరోజు సమీక్షా సమావేశాల సారాంశాన్ని ఏరోజుకారోజు కేసీఆర్‌కు నివేదికిస్తున్నామని కెటిఆర్ పార్టీ క్యాడర్‌కి చెప్పారు.