Site icon Prime9

KTR: బీజేపీతో పొత్తు లేదు.. ఉండదు.. కేటీఆర్

KTR

KTR

KTR: బీజేపీతో పొత్తు గతంలో లేదని, భవిష్యత్‌లో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బి టీం కాదని కెటిఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ 45 ఏండ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ -బీజేపీ కుమ్మక్కు..(KTR)

కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీం కోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదని కెటిఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే వారు శంకరాచార్యులు పీర్ల పండగకు ముడి పెడుతున్నట్టు లెక్కని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు కావడం వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని కెటిఆర్ విమర్శించారు. అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్దతి మారిందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హై కోర్టుకు వెళ్లినా మనకు నిరాశ తప్పలేదని కెటిఆర్ చెప్పారు. బిజెపి మతాన్ని రాజకీయానికి వాడుకుంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ , భువన గిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమోనని కెటిఆర్ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే .. కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువని కేటీఆర్ వివరించారు.

ఇక ఎమ్మెల్యే చుట్టూ బిఆర్ఎస్ పార్టీ తిరిగే విధానం ఉండదని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగే పద్ధతి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ లో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటామని, తప్పుడు కేసులను ఎదుర్కొంటామని కేటీఆర్ ప్రకటించారు.

Exit mobile version