Krishna water Dispute: సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కి వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. కౌంటర్ దాఖలుకి తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది కోరారు. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సాగర్ నుంచి నీరు తీసుకోవద్దు..(Krishna water Dispute)
మరోపక్క కృష్ణా జలాల వివాదం, నాగార్జున సాగర్ డ్యాం వద్ద గొడవపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పందించింది. నాగార్జున సాగర్ కుడి కాలువనుంచి నీరు తీసుకోవడాన్ని తక్షణమే ఆపాలని కృష్ణాబోర్డు ఆదేశించింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్‌కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5. పాయింట్ సున్నా ఒకటి టిఎంసిల నీరుని విడుదల చేశామని లేఖలో గుర్తు చేశారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదల కోసం ఏపీ నుంచి వినతి అందలేదని కృష్ణా బోర్డు వెల్లడించింది.