Konathala-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బేటీ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తో ఆయన చర్చలు జరిపారు. కొణతాల త్వరలోనే మంచిరో్జు చూసుకుని జనసేన పార్టీలో చేరనున్నారు.

  • Written By:
  • Updated On - January 17, 2024 / 08:52 PM IST

 Konathala-Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తో ఆయన చర్చలు జరిపారు. కొణతాల త్వరలోనే మంచిరో్జు చూసుకుని జనసేన పార్టీలో చేరనున్నారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి జనసేన తరుపున ఎంపీగా పోటీచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఎంపీగా, మంత్రిగా ..( Konathala-Pawan Kalyan)

ఉత్తరాంధ్రలో సీనియర్‌ నాయకుడుగా పేరున్న కొణతాల రామకృష్ణ 1989లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్దానాన్ని ప్రారంభించారు. తరువాత 1991లో కూడా ఆయన అదే స్దానం నుంచి గెలుపొందారు. 1996లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిన కొణతాల 2004లో అదే స్దానంనుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2004 నుండి 2009 వరకు వైఎస్సార్ క్యాబినెట్‌లో వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, న్యాయ తదితర శాఖలకు మంత్రిగా కొణతాల రామకృష్ణ పనిచేశారు. వైఎస్సార్ మరణానంతరం వైఎస్‌ఆర్‌సిపి లో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటి చైర్మన్‌గా పనిచేశారు. అయితే 2014లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ ఓడిపోయిన తరువాత ఆయనకు, జగన్ కు గ్యాప్ వచ్చింది. వైఎస్‌ఆర్‌సిపి కి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున ఆ ప్రాంతం సమస్యలపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. సుమారుగా పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల ఇపుడు జనసేన వైపు చూడటం విశేషం.