Site icon Prime9

Kodada: తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్

Kodad

Kodad

Kodada: తెలంగాణలో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. ఇన్వెస్టిగేషన్, సమన్లు, కోర్ట్ మానిటరింగ్, సైబర్ క్రైమ్ మానిటరింగ్, పోలీస్ హెచ్‌ఆర్‌ఎంఎస్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మరియు పోలీస్ ట్రాన్స్‌పోర్టేషన్ నిర్వహణలో ఇది ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది.

ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కోదాడ పట్టణ పోలీసులను రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దిన సూర్యాపేట జిల్లా పోలీసులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి అభినందించారు. ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏడు వర్టికల్ ఫంక్షనింగ్ అమలులో సూర్యాపేట జిల్లా పోలీసులను అగ్రస్థానంలో నిలిపేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై జిల్లా పోలీసులు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీసుల టీమ్ వర్క్ కూడా సమర్థవంతమైన పోలీసింగ్‌కు సహాయపడుతోందని తెలిపారు.

Exit mobile version