Kiran Royal: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ను.. అధికారులను పట్టించుకోకుండా కౌంటింగ్ వెళ్ళాలని ఎలా సజ్జల చెబుతారని నిలదీశారు. వైసీపీ కేడర్ సజ్జల ట్రాప్ లో పడొద్దని సూచించారు.
వైసీపీ గెలిస్తే పోస్టర్లు అంటిస్తాను..(Kiran Royal)
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. ఒకవేళ వైసీపీ గెలిస్తే.. తన సొంత డబ్బులతో తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్ ను ఆహ్వానిస్తూ పోస్టర్లు అంటిస్తానని కిరణ్ రాయల్ ఛాలెంజ్ చేశారు.ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా సజ్జల మాట్లాడుతున్నారని విమర్శించారు .ఒక వైపు వైసీపీ నేతలంతా కూటమీ గెలుస్తూందని బెట్టింగ్ వేస్తున్నారన్నారు . రోజా గెలుస్తూందని కనీసం రోజా అయినా బెట్టింగ్ వేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు . రోజా ఓడిపోతుందని నగరిలో వైసీపీ కార్యకర్తలే చేబుతున్నారని పేర్కొన్నారు .కూటమి బలమైన మెజారిటీతో గెలుస్తూందని తెలిపారు . సజ్జల ట్రాప్ లో పడకండని చెప్పారు . వైసీపీ గెలిస్తే జనసేనకు రాజీనామా చేసి వైజాగ్ వరకు సిఎం జగన్ కోసం పోస్టర్లు అంటిస్తాం అని పేర్కొన్నారు . అదే విధంగా తిరుపతిలో ఇరవైఐదు వేలకు పైగా ఓట్లతో ఆరిణి శ్రీనివాసులు గెలుస్తారని చెప్పారు .