Site icon Prime9

Minister Srinivas Goud: కేసీఆర్ సైన్యం చావడానికైనా, చంపడానికైనా సిద్దమే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud

Minister Srinivas Goud

Minister Srinivas Goud: కేసీఆర్ సైన్యం చావడానికైనా, చంపడానికైనా సిద్దమేనని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. అన్ని అంశాలపై పట్టున్నవారికే కేసీఆర్ సీఎం పదవులు అప్పగించారన్నారు.

కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 జోక్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తమకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ సింగల్ గానే పోటీ చేస్తుందన్నారు. ప్రజలు సింగిల్‌గా బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారు. పోలవరం విషయంలో కేసీఆర్ విశాల దృక్పథంతో పని చేస్తారన్నారు. మాణిక్కం ఠాగూర్ అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులపై వారు అంతర్గతంగా చర్చించుకుంటారని.. అది తమకు సంబంధం లేని విషయమన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల సంఘం నేతగా శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించారు. 2014లో తొలిసారిగా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018లో ఆయన రెండోసారి అదే స్థానం నుండి విజయం సాధించి మంత్రి పదవిని పొందారు.

Exit mobile version