Site icon Prime9

Hyderabad Metro: హైద్రాబాద్ మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు భూమి పూజ చేశారు.

ఈ మార్గంలో .31 నిమిషాల్లో రాయదుర్గం నుండి శంషాబాద్ కు వెళ్లవచ్చు. త్వరగా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఈ మెట్రో రైలు దోహదపడుతుంది. అందుబాటులో ఉన్న అత్యాధునికి టెక్నాలజీని ఈ మెట్రో రైలు నిర్మాణంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైండ్‌స్పేస్‌ సర్కిల్ నుంచి 0.9 కి.మీ. దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ సర్కిల్‌లోని రెండు ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్‌మెంట్‌ వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ సర్కిల్, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా ఎలైన్‌మెంట్‌ రూపొందించారు.

ఇప్పటికే ఉన్న మెట్రోతో పోలిస్తే మరిన్ని ప్రత్యేకతలు ఉండనున్నాయి. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు..ఆకాశ మార్గంలో మాత్రమే పయనిస్తుండగా.. ఎక్స్ ప్రెస్ మెట్రో తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో నడవనుంది. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 31 కిలో మీటర్ల మార్గంలో.. 27.5 కిలో మీటర్లు ఆకాశమార్గంలో ఉంటుంది. అయితే 1 కిలో మీటర్ భూమార్గంలో వెడుతుంది.రూ. 6,250 కోట్లతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో పలు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Exit mobile version