PackageStarYSJagan: నాడు నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్ల చెక్కును సీఎం జగన్ కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై జనసేన నేతలు ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర స్పందిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం సమీపంలోని లారస్ ల్యాబ్స్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటివరకూ నివేదిక రాలేదని అటువంటపుడు ఆ యాజమాన్యం నుంచి సీఎం జగన్ సీఆర్ఎస్ చెక్ ఎలా తీసుకుంటారని ప్రముఖ న్యాయవ్యాది కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఇలాంటి సంఘటనలు 20 జరిగాయి. దీనిని బట్టి ప్రభుత్వ ఉదాసీనత అర్దం చేసుకోవచ్చు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్షిబిలిటీ) పథకం కింద చెక్కులు ఇవ్వడాన్ని తప్పు బట్టను కాని దాని వెనుక ఏమి జరిగిందనేది ముఖ్యమన్నారు. నేరుగా సీఎంకే డబ్బులు ఇస్తున్నారు.. కేసులు మాఫీ చేసుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
నలుగురు ఉద్యోగులు చనిపోతే ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఇప్పటివరకూ నిర్దారించలేదు. దర్యాప్తు పూర్తి కాలేదు. కాని సీఎం జగన్ లారస్ ల్యాబ్స్ యాజమాన్యం నుంచి చెక్ తీసుకుంటూ నవ్వడం ఏమిటి? ఇది శవాలపై పేలాలు ఏరుకోవడమేనని అన్నారు. సీఎం జగన్ ప్యాకేజీ స్టార్ అనడానికి ఇది పెద్ద నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా నిందితుల దగ్గర నుంచి సీఎం డబ్బులు తీసుకుంటే పోలీసులు సరిగా దర్యాప్తు చేస్తారా అని కళ్యాణ్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత సొమ్మును బాధితులకు పంచుతున్నారని అయితే సీఎం జగన్ నిందితుల నుంచి డబ్బు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. గుడివాడ అమర్నాథ్ ఎక్కడ? నీది ఏ శాఖ? నిందితుల్ని తీసుకెళ్లి సీఎం జగన్‌ను కలిపింది ఎవరు?వందమందిని చంపి వంద కోట్లు ఇస్తామంటే కరెక్టేనా? ఇదేం ప్రజాస్వామ్యం?
సీఎస్ఆర్ నిధులా? ప్యాకేజీ నిధులా? ఇదేం ప్రజాస్వామ్యం? అంటూ ఆయన మండిపడ్డారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/