Junior NTR:ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు స్థలాన్ని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయని తెలిపారు. ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫిర్యాదు చేయండంతో భూమిని విక్రయించిన సుంకు గీతపై కేసు నమోదైంది.
జూన్ 6కు వాయిదా..(Junior NTR)
జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా డీఆర్టీ రావడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. డీఆర్‌టీ ఆర్డర్‌లో లోపం ఉందని ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది.జూన్ 3 లోపు డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది.జూన్ 6 న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇలాఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ నటిస్తున్న వార్-2తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.