Janasena Formation Day: ప్రజలకు సేవ చేయడానికే జనసేన పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీ పట్నం నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నించడం కోసమే ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా జనసేన అండగా ఉంటుందని అన్నారు.
సీఎం కేసీఆర్.. వెయ్యి కోట్ల ఆఫర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇస్తారన్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ సభా ముఖంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన చమత్కరించారు. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా అని వ్యాఖ్యనించారు. నాకు రూ. 10 వేల కోట్లు ఇస్తారంటే వినడానికి బాగుండేది. డబ్బుతో నేను మిమ్మల్ని, మీ ఓట్లను కొనగలనా అని ప్రశ్నించారు. డబ్బే కావాలని అనుకుంటే.. సినిమాల్లో నటిస్తే.. రోజుకు రెండు కోట్లు సంపాదించేవాడినని అన్నారు. 20 రోజుల్లో 40-45 కోట్లు వస్తాయని అన్నారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని.. ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశాం..
జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచనతోనే ప్రజల్లోకి వచ్చినట్లు తెలిపారు. అభిమానులు ఇచ్చిన ధైర్యం.. సమాజంలో జరుగుతున్న చెడును చూసే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటుకు స్వాతంత్ర్య సమరయోధులను స్పూర్తిగా తీసుకున్నట్లు ఆయన అన్నారు. సగటు మనిషికి న్యాయం చేయాలన్నదే తల తపన అని సభావేదికగా తెలిపారు.