Site icon Prime9

Pawan Kalyan: రేపటినుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపటినుంచి నాలుగు రోజులపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.

28, 29, 30 తేదీలలో..(Pawan Kalyan)

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌నుంచి ఊరేగింపుగా రాజనగరం నియోజకవర్గం మీదుగా పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళనున్నారు. రానున్నఅసెంబ్లీ ఎన్నికలపై కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జిల్లాలోని జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి చర్చలు జరుపనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు రాజానగరం జనసేన ఇంఛార్జి బత్తుల బలరామ కృష్ణ సన్నాహాలు ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు భారీగా తరలివచ్చి పవన్‌కు ఘన స్వాగతం పలకాలని బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు.

Exit mobile version