Pawan Kalyan comments: విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. ఆంక్షల మధ్యే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. రుషికొండపై నిర్మాణాలను బయటి నుంచే పరిశీలించారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రుషికొండపై పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.
కిర్లంపూడిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా..(Pawan Kalyan comments)
క్యాంప్ ఆఫీస్ కోసం రుషికొండను తవ్వేస్తారా అని ధ్వజమెత్తారు. వరదలు, తుఫానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉండేందుకే రుషికొండ ఉందన్నారు. రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు.. అందుకే తెలంగాణలో తన్ని తరిమేశారన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కిర్లంపూడిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా? రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా? చిన్న చిన్న లొసుగులున్నాయని వారే చెబుతున్నారు.మూడు రాజధానులు అంటున్నారు. ఒక్క రాజధానికే దిక్కులేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
అంతకుముందు జనసేనాని రుషికొండ పర్యటనపై హై డ్రామా నెలకొంది.రుషికొండపై నిర్మాణాలు చూసేందుకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు.కొండపైకి వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేసారు. తరువాత నోవాటెల్ హోటల్ పవన్ కళ్యాణ్ తో పోలీసులు సంప్రదింపులు జరిపారు. భారీ ర్యాలీ కీ అనుమతి లేదని, ఒకటి , రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఈ నేపధ్యంలో పోలీసుల పోలీసుల ఆంక్షల మద్య పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. తరువాత పవన్ కారుతో పాటు 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా వాహనాలను జోడుగుళ్లపాలెం దగ్గర ఆపేసారు. దీనితో జనసైనికులు వాహనాలను పక్కనపెట్టి కాలి నడకన రుషికొండకు బయలుదేరారు.