Site icon Prime9

Janasena Chief Pawan kalyan: ఎన్నికలముందు కులగణన ఎందుకు ? సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగలేఖ

pawan kalyan

pawan kalyan

Janasena Chief Pawan kalyan:  ఏపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాసారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏది ? (Janasena Chief Pawan kalyan)

పథకాల కోసమా ఎన్నికల్లో విజయం కోసమా ఈ కుల గణన ? 2 నెలల్లో ఎన్నికలు ఉండగా కుల గణన ఎందుకో జగన్ చెప్పాలి. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ?కుల గణన చేపట్టడానికి కారణాలను వివరిస్తూ ప్రభుత్వపరమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదు? అమెరికా, యూరోప్ పాశ్యాత్య దేశాల్లో కేంబ్రిడ్జి అనలిటికా చేపట్టిన డేటా సేకరణ ప్రక్రియ ఎంత విధ్వసం సృష్టించిందో తెలియదా? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత స్వేచ్ఛను హరించడం కాదా? అని పవన్ తన లేఖలో ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తుందనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే కాకుండా న్యాయపరంగా కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తామని తెలిపారు.

Exit mobile version