Janasena Chief Pawan kalyan: ఆ ఊరులో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుతీర్చుకుంటే మాములు విషయమే కదా అని అనుకుంటే పొరపాటే ..ఆ మొక్కుకు ఒక లెక్కవుంది .జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ఆ ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు తీర్చడం తో వార్తల్లోకి ఎక్కింది . అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస లో పవన్ కళ్యాణ్ కు విజయం వరించడంతో ఊరంతా కలిసి మొక్కులు తీర్చుకున్నారు . పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో గ్రామంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు.
పవనుడికి వెండి దండ..(Janasena Chief Pawan kalyan)
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని పోలేరమ్మకు పూజ చేసిన వెండి పూలతో విజయ దండ చేయించి పవన్ కళ్యాణ్ మెడలో వేశారు .అప్పుడే ఈ మొక్కును మొక్కారని తెలుస్తోంది .పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంతో పాటు ,రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఇదే పోలేరమ్మ తల్లికి 101 కోళ్లను బలివ్వాలని ప్రతిన బూనినట్లు గ్రామస్థులు చెబుతున్నారు .పిఠాపురం నుండి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం తోపాటు ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించడంతో అభిమాని దొరబాబు తోపాటు గ్రామస్తులు అంతా కలిసి గ్రామ దేవత పోలేరమ్మ కు ఊరందరు కలిసి కోళ్లు పట్టుకుని అమ్మవారి ఆలయం వద్ద మొక్కులు తీర్చుకున్నారు.
పవనుడికి పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని సమనస ఊరంతా పండగలా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. గ్రామదేవత పోలేరమ్మకు నైవేద్యం లతో అమ్మవారికి పూజలు చేసి కోళ్ళ ను ఊరిలో ఉన్న మరి కొందరికి పంచిపెట్టారు.పవన్ ప్రతి విజయం వెనుక పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను పవన్ అధిరోహించాలని గ్రామస్తులు కోరారు.అయితే ఊరందరు ఒకేసారి కోళ్లు చేతపెట్టుకుని అమ్మవారి ఆలయం దగ్గరకు కలిసి రావడంతో అందరిని ఆకట్టుకుంది.