Site icon Prime9

Janasena chief Pawan Kalyan: మంగళగిరి కార్యాలయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Janasena chief Pawan Kalyan: పోలీసు సెక్యూరిటీ నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల యంత్రాంగం దగ్గరుండి కార్యాలయానికి చేర్చారు. దారంతా జనసైనికులు రక్షణ వలయంగా వెంట సాగారు. మంగళగిరికి వెళ్లాలని బయల్దేరిన జనసేనానిని జగ్గయ్యపేటలోని గరికపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 ఏపీకి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ కావాలా?..(Janasena chief Pawan Kalyan)

పవన్ కళ్యాణ్ కాన్వాయి దగ్గరకి జనసేన నేతలు అభిమానులు చేరుకున్నారు. జనసైనికుల నడుమన పవన్ ముందుకు కదిలారు. కాని అనుమంచి పల్లి వద్ద పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో సేనాని వాహనం దిగి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎట్టకేలకు తీవ్ర ఉద్రిక్తతల నడుమన పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. ఏపీకి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ కావాలా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబుని పరామర్శించేందుకు విజయవాడ వెళ్ళాలనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పవన్ కళ్యాణ్ వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలకి విఘాతం కలుగుతుందని విమానాశ్రయ అధికారులకి జిల్లా ఎస్పీ లేఖ రాశారు. గన్నవరం విమానాశ్రయ అధికారులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతిని నిరాకరించారు. ఈ మేరకు పోలీసులనుంచి వచ్చిన సూచనలని విమానాశ్రయ అధికారులు అంగీకరించారు.బేగంపేట విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాకుండా పవన్ కళ్యాణ్ విమానాన్నిఅడ్డుకున్నారు. మరోపక్క గన్నవరం విమానాశ్రయం దగ్గర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని పోలీసులు అడ్డుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని రిసీవ్ చేసుకునేందుకు మనోహర్ విమానాశ్రయానికి వెళ్ళారు. అయితే నాదెండ్ల మనోహర్‌ని విమానాశ్రయంలోకి అనుమతించేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరారు.

పవన్ కు పురందేశ్వరి సపోర్ట్ ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్వీట్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. పవన్‌ను అడ్డుకోవడం సమర్థనీయం కాదని.. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు. పవన్ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి పాస్ పోర్ట్ అవసరం లేదన్నారు.

ఈరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు మంగళగిరి జన సేన జన సేన పార్టీ కార్యాలయం లో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన. జన సేన పార్టీ పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ మీటింగ్ ప్రారంభం కానుంది.రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు, జన సేన పార్టీ జిల్లా అద్యక్షులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరగనుంది.
నాలుగో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ పై కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా రాష్ట్ర లో శాంతి భద్రతలు పై పొలిటికల్ అఫైర్ కమిటీ లో చర్చిస్తారు.

Exit mobile version