Site icon Prime9

Hari Rama Jogaiah: జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి.. చేగొండి హరి రామ జోగయ్య

Hari Rama Jogaiah

Hari Rama Jogaiah

Hari Rama Jogaiah: జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాపు సంక్షేమ సేన నాయకులు కృషి చేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

సమన్వయ కమిటీకి సహకరించాలి..(Hari Rama Jogaiah)

కాపు సంక్షేమ సేన జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు ఈ మేరకు కృషి చేయాలని సూచించారు. కాపు సంక్షేమ సేన నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు జనసేన, టిడిపి సమన్వయ కమిటీకి సహకరించాలని కోరారు. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఐక్యకార్యాచరణ కమిటీలు ఏర్పాటుచేసుకుని ముందుకు నడుస్తున్నాయన్నది మీకు తెలియనిది కాదు. కాపు సంక్షేమసేన కమిటీలు వివిధ స్దాయిల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కమిటీలతో కలిసి వారి విజయానికి తోడ్పడాలని జోగయ్య తనప్రకటనలో సూచించారు.

హరిరామయ్య జోగయ్య ఇటీవల పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు చేయవలసిన కార్యక్రమాల అమలు గురించి ఇందులో వివరించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిని పరిశీలించాలని కోరారు. ఈ హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ మేనిఫెస్టో తయారు చేసామని చెప్పారు.

Exit mobile version