Jana Sena Chief Pawan Kalyan: ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సమీక్షించి చర్చించారు.
పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలి..( Jana Sena Chief Pawan Kalyan)
వారాహి 5వ విడత యాత్ర, జనసేన- టిడిపి సమన్వయ కమిటీ ఉమ్మడి సమావేశ నిర్వహణ,రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.