Minister Gudivada Amarnath: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దమ్ముంటే పవన్‌ను 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిన్న సభలో స్టీల్‌ప్లాంట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.
బైడెన్ కు, పుతిన్ కు చెప్పుకో..(Minister Gudivada Amarnath)
సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి చెబితే ఎవరికి భయం? మేం చేసిన తప్పేంటి? ఎవరికో చెబితే భయపడే ప్రభుత్వం జగన్‌ది కాదని తెలుసుకోవాలన్నారు. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పుకోండి అని ఎద్దేవా చేశారు.పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయడని అన్నారు. వపన్ కు ఒక విధానం, సిద్దాంతం లేవని ఆయన విమర్శించారు.
చంద్రబాబు తనకు లోకేష్ కన్నా మీరే ఇష్టమని చెప్పారా? సీఎం ను చేస్తానని చెప్పారా? జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే అజెండాగా ఉందా? రాష్ట్రంలో ఒక వర్గానికి,యువతకు, మహిళలకు, రైతులకు సంబంధించి పవన్ ఆదరిస్తున్నాడన్న గుర్తింపు ఉందా? సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి ఒక యాంకర్ తప్పుగా మాట్లాడితే ఎందుకు ఖండించలేదు? ఎంతసేపు జగన్ ను తిడితే తాను సీఎం అయిపోతానని పవన్ భావిస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు.