Site icon Prime9

TDP: జగనాసుర దహనం.. టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం

TDP

TDP

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం.., మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని తెలిపారు.

సైకో పోవాలంటూ (TDP)..

జయదశమి అంటేనే చెడుపై సాధించిన గెలుపు. ఈరోజు జన హితం కోరి ఏది చేసినా ఆ దుర్గమ్మ అనుగ్రహిస్తుంది. సైకో పాలన అంతం కావడం కన్నా రాష్ట్రానికి మంచి ఏముంటుంది. అందుకే అక్టోబ‌ర్ 23న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7 గంటల ఐదు నిమిషాల మ‌ధ్యలో వీధుల్లోకి వ‌చ్చి సైకో పోవాలని రాసున్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండని పిలుపునిచ్చారు. దహనాల వీడియోలు, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయండని అన్నారు. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని జరుపుకుందామని అన్నారు.

మరోవైపు నేడు రాజమండ్రిలో నేడు జనసేన టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్‌లో ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ , లోకేష్ అధ్యక్షతన ఉమ్మడి జాయింట్ యాక్షన్ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది.

 

Exit mobile version