Site icon Prime9

Ap Cm Jagan: తెదేపా, జనసేనకు జగన్ సవాల్.. ఏమన్నారో తెలుసా?

cm-ys-jagan-comments on chandrababu

cm-ys-jagan-comments on chandrababu

Ap Cm Jagan: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన 175 స్థానాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా? (Ap Cm Jagan)

రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారికి సవాల్ విసిరారు. వైసీపీ పేదల ప్రభుత్వమని.. చంద్రబాబుది పెత్తందారీ ప్రభుత్వమని విమర్శించారు. తెనాలిలో నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను.. 98శాతం అమలు చేస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నామని.. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు ధైర్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతున్నారని ప్రశంసించారు.

మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు

గత ప్రభుత్వ హయంలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులపై సీఎం ప్రశంసలు కురిపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రైతు భరోసాతో 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని జగన్ అన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించినట్లు జగన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని.. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరవు అనే మాటే లేదని జగన్ వివరించారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరవు ఉందని.. కరవుకు కేరాఫ్‌ అ‍డ్రస్‌ చంద్రబాబు అని విమర్శించారు. పట్టా ఉన్న రైతులకే కాకుండా అసైన్డ్‌ భూముల రైతులు, కౌలు రైతులలకూ రైతు భరోసా అందించినట్లు తెలిపారు.

Exit mobile version