Site icon Prime9

Hero Vishal: చంద్రబాబును అరెస్ట్ చేసేముందు ఆలోచిస్తే బాగుండేది.. హీరో విశాల్

Hero Vishal

Hero Vishal

Hero Vishal: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన తారలు పెద్దగా స్పందించలేదు. అయితే తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తమిళ హీరో విశాల్ కూడా చేరారు.

సామాన్యులు భయపడతారు..(Hero Vishal)

విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఇటీవల తెలుగులో కూడా విడుదలయి మంచి విజయాన్ని సాధించింది. ఈరోజు హైదరాబాద్‌లో ఈ చిత్రం సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి విశాల్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అరెస్టుపై విశాల్ చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ప్రభుత్వం కాస్త ఆలోచించి ఉంటే బాగుండేదని విశాల్ అన్నారు. అంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేస్తే మనలాంటి సామాన్యులు భయపడతారు. సాక్ష్యాధారాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది’ అని విశాల్ అన్నారు. .సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండడంతో ఈ కేసు పై దృష్టి సారించలేదు. అయితే చివరకు న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఉంది. బయట నటులమే కావచ్చు, ఇంట్లో మాత్రం సామాన్యులమే అని విశాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో విశాల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని, కుప్పం నుంచి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి చంద్రబాబుపై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. గతంలో విశాల్ కూడా తనకు జగన్ అంటే ఇష్టమని, ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసే అవకాశం వస్తే ఓటు వేస్తానని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబును సమర్థిస్తూ వైఎస్ జగన్‌ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఇక మార్క్ ఆంటోనీ సినిమా గురించి మాట్లాడుతూ ఈ కొత్త కథ వినగానే నచ్చింది. అందుకే ఆలోచించలేదు. ఈ సందర్భంగా రచయిత రాజేష్ మూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘మార్క్ ఆంటోని’ స్ట్రెయిట్ తెలుగు సినిమాగా నిలవాలని చాలా ప్రయత్నించింది. ఆడియన్స్ సపోర్ట్ నాకు సరిపోతుంది. అవార్డులు అవసరం లేదు అని అన్నారు. విశాల్, ఎస్.జె. ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో అదే పేరుతో సెప్టెంబర్ 15న విడుదలయింది. ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్లో విశాల్ తో పాటు ఎస్.జె. సూర్య, టాలీవుడ్‌ నటుడు సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కి ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? | Vishal About Chandrababu |Prime9 Entertainment

 

Exit mobile version
Skip to toolbar