KTR Tweet: రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించాలనుకోవడం సిగ్గుచేటు: కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. తన పోస్ట్ కు రెండు చార్మినార్ ఫొటోలను జత చేశారు.

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 12:42 PM IST

KTR Tweet:  తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. తన పోస్ట్ కు రెండు చార్మినార్ ఫొటోలను జత చేశారు.

హైదరాబాద్‌కు ప్రతిరూపంగా చార్మినార్..(KTR Tweet)

శతాబ్దాలుగా హైదరాబాద్‌కు ప్రతిరూపంగా, గుర్తుగా చార్మినార్ కొనసాగుతోంది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. హైదరాబాద్ గురించి ఎవరైనా తలచుకుంటే చార్మినార్‌ ను గుర్తుచేసుకోక తప్పదు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అన్ని లక్షణాలు ఈ చారిత్రక నిర్మాణానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ చిహాన్ని రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోందని.. ఎంత సిగ్గుచేటు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.