Site icon Prime9

Inter Exams: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

inter exams

inter exams

Inter Exams: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ పరీక్ష జరగనుంది.

ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభం (Inter Exams)

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్‌ పరీక్ష జరగనుంది. తెలంగాణలో 1473, ఏపీలో 1489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో మెుదటి సంవత్సరం విద్యార్ధులు 4,82,677.. కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 4,65,022 మంది పరీక్షలు రాస్తున్నారు.
ఏపీ విషయానికి వస్తే.. మొత్తంగా10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఏపీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,82,677 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 4,65,022 మంది ఉన్నారు.

ప్రతి పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరింది. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను సైతం కోరింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలు సీల్ తీయడం, జవాబు పత్రాలు ప్యాక్ చేస్తామని అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్స్ నేరుగా విద్యార్థులే డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. హాల్ టికెట్‌పై పేరు, సబ్జెక్ట్స్ పరిశీలించుకోవాలని విద్యార్థులకి సూచించారు. ఇన్విజిలేటర్స్ కి కూడా పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసీ బస్సు ఆపాలని బోర్డు అధికారులు సూచనలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేయమని కోరారు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.

Exit mobile version