Site icon Prime9

Pensions Hike In AP : వృద్ధులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్… జనవరి 1నుంచి వృద్ధాప్య పెన్షన్ల పెంపు..!

pensions

pensions

Pensions Hike In AP : ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం రూ2,500 పెన్షన్ కు రూ.250 పెంచి జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,750 పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనితో 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. పవర్ ప్రమోషన్ పాలసీ 2022 కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేలా కంపెనీకి కడపలో JSW స్టీల్ ప్లాంటను నిర్మించాలని నిర్ణయించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆక్ట్ 1935 సవరణలకు ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నెల 21 న ఐదు లక్షల ట్యాబ్ లు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్ లో టీవీ ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఏపీ జ్యుడిసీయల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతిని ఇచ్చింది. హెల్త్ హబ్స్ ఏర్పాటులో కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు కు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హెల్త్ హబ్స్ ఏర్పాటులో కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Exit mobile version