Site icon Prime9

V. Vijayasai Reddy : ఇంకో 6 నెలల్లో పచ్చ పార్టీ ముక్క చెక్కలవుతుంది.. ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy

AndhraPradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లపై సెటైర్లు వేసారు. చంద్రబాబు మంత్రదండం శక్తి కోల్పోయిందన్నారు. కమ్మని కధలు వినిపించడంలో లోకేష్ తండ్రిని మించి పోయాడని అన్నారు.

ఇంకో 6 నెలల్లో పచ్చ పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఫ్యూచర్ కోరుకునే నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోతారు. బాబు మంత్ర దండం ‘తంత్ర’ శక్తిని కోల్పోయింది. వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ పవర్ సన్నగిల్లింది. ప్రజల్లో ఆదరణ లేదు. ఎలక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదని క్యాడర్ కు అర్థమైంది.తండ్రిని మించిపోయాడు పప్పేశ్. మెదడులో చిప్ లేకున్నా ఊహాశక్తికి పదును పెట్టి కమ్మని కథలు వినిపిస్తున్నాడు. ప్రజల దగ్గరకు వెళ్లండి బాబూ. ఓడినా ఎప్పుడైనా వెళ్తే గుర్తుపట్టి పలకరిస్తారు. టీవీ ఛానెళ్లను మేపి జనానికి దూరం కాకండి. పొగడ్తల మాయలో పడ్డోడు రాజకీయంగా ఫినిష్ అయినట్టే అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేసారు.

Exit mobile version