Site icon Prime9

Vasireddy Padma : ఐటమ్ వంటి పదాలు వాడితే జైలుకే.. ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma: ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్షలు పడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలాంటి వాళ్లపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. స్పెషల్ టీమ్‌లతో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని ఆమె కోరారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ కల్యాణ్ మాటలున్నాయని పేర్కొంది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళా కమీషన్ నోటీసులకు జనసైనికులు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ఏపీలో గతంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు జరిగినపుడు మహిళా కమీషన్ ఏం చేసిందని ప్రశ్నించారు. వాసిరెడ్డి పద్మక్క .. మహిళా కమీషన్ ఎక్కడ అంటూ 14 ప్రశ్నలు అడిగారు.

Exit mobile version