Site icon Prime9

Rajasingh Comments: దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చేయి.. అసదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ సవాల్

Rajasingh

Rajasingh

Rajasingh Comments: హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ నోరు అదుపులోకి పెట్టుకోకుంటే పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీపై మూకదాడి జరగడం ఖాయమని హెచ్చరించారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్‌నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు.

ఓవైసీ సోదరులిద్దరూ బ్లాక్ మెయిలర్స్..( Rajasingh Comments)

హైదరాబాద్‌నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీని అసదుద్దీన్ సవాల్ చేయడాన్ని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్‌నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు. ఓవైసీ సోదరులకి దమ్ముంటే మీలో ఎవరో ఒకరు గోషామహల్‌కి రండి.ఎన్నికల్లో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాపై పోటీ చేయండి. ఓవైసీ సోదరులిద్దరూ బ్లాక్ మెయిలర్స్. ఓవైసీలాంటి అడవి పాముని పెంచింది కాంగ్రెస్సే నని రాజాసింగ్ పేర్కొన్నారు. ఎవరైనా మాట్లాడితే పార్లమెంటులో మూకదాడులు జరిగే అవకాశం ఉందని ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కూడా రాజాసింగ్ తిప్పి కొట్టారు.మీరు పార్లమెంటులో కొంత మర్యాదగా మరియు గౌరవంగా మాట్లాడాలి. అక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. మీరు చెప్పేది వారికి అర్థం కాకపోతే, మీరు వారికి లక్ష్యంగా మారుతారని అన్నారు. ఎంఐఎం ముస్లిం ఓట్లను గతంలో కాంగ్రెస్ కు, ఇపుడు బీఆర్ఎస్ కు విక్రయించిందని అన్నారు.

Exit mobile version