Site icon Prime9

Gudivada Amarnath: పవన్ కల్యాణ్ పేరుతో సినిమా తీస్తే నిర్మాతగా ఉంటాను.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారని.. సీఎం పవన్ కల్యాణ్ పేరుతో సినిమా తీస్తే తానే నిర్మాతగా ఉంటానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. అనకాపల్లి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పవన్‌కు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదన్నారు.

సినిమాల్లో పవర్ స్టార్, పాలిటిక్స‌లో ప్యాకేజ్ స్టార్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే పవన్ ను కనీసం తెరపై అయినా సీఎంగా చూసుకోవచ్చని, నిజ జీవితంలో ఆయన ఎలాగూ సీఎం కాలేరని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి మహా ప్రస్థానం ఖాయమని అమర్‌నాథ్ జోస్యం చెప్పారు.మరోవైపు మంత్రి అంబటి రాంబాబు సైతం పవన్‌పై విమర్శలు గుప్పించారు. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణిచి వేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు.

ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. హరి రామజోగయ్య దీక్ష చేస్తేనే పవన్ స్పందించారని అంబటి చురకలంటించారు. టీడీపీ ప్రభుత్వంలో మాట్లాడని పవన్.. జగన్ సీఎంగా వున్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని రాంబాబు నిలదీశారు.

Exit mobile version