Site icon Prime9

Marri Sashidhar Reddy : తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలైనా ఇస్తాను.. మర్రి శశిధర్ రెడ్డి

Marri

Marri

Marri Sashidhar Reddy : తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. కొద్ది రోజులకిందట శశిధర్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా ను కలిసిన తరువాత ఆయనను కాంగ్రెస్ పార్టీనుంచి బహిస్కరించిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నారని.. కానీ అది రాలేదని అన్నారు. మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిస సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు.

Exit mobile version