MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
ఎంఐఎం చేతిలో గోషామహల్ బీజేపీ టిక్కెట్ ..(MLA Rajasingh)
తనపై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను పార్టీ మారుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. రాజకీయాలకు దూరంగానైనా ఉంటాను కానీ ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లను. ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి పోను.తెలంగాణను హిందూ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం.బీజేపీ టికెట్ రాకపోతే రాజకీయాలు పక్కనపెడతాను.హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని తెలిపారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది.అందుకే ఇంకా పెండింగ్‌లో పెట్టారు.దారుసలామ్ నుంచి గోషామహల్ అభ్యర్థి ఎంపిక చేస్తారు.నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ..స్వతంత్రంగా, వేరే పార్టీల నుంచి పోటీ చేయను. బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయంలో నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజాసింగ్ అన్నారు.