CM YS Jagan: రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు నీరందించే హంద్రీనీవా ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
చంద్రబాబులా. ఎన్నికలకు నాలుగు నెలల ముందు హామీలిచ్చే వ్యక్తిని కానని.. ఇచ్చిన మాటపై నిలబడతానని అన్నారు. ఈ ప్రాజెక్టును 250 కోట్లతో ప్రారంభించామన్నారు. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఎన్నికలకు 4 నెలల ముందు ఒక జీవో ఇచ్చింది.ప్రాజెక్టు కోసం భూములు సేకరించలేదు కానీ టెంకాయ కొట్టడానికి 8 ఎకరాలు కొన్నాదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు హంద్రీ నీవా కాలువను 6 వేల కోట్లతో నిర్మించారని దీనితో తూములను ఏర్పాటు చేసుకుని చెరువులను నీళ్లతో నింపుతున్నామన్నారు. మనం అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లల్లో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం.ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది.రూ.250 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించామని జగన్ చెప్పారు.
గాజులదిన్నె ప్రాజెక్టుతో 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాల కేటాయింపులు లేవని,కేవలం వర్షం నీరే దిక్కని జగన్ అన్నారు.అధికారంలోకి వచ్చాక గాజులదిన్నె ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చామని తెలిపారు.గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుకున్నామని ఈ విధంగా పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.