Child Trafficking Racket: అంతర్రాష్ట్ర పిల్లల అక్రమరవాణా ముఠా గుట్టును హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసులు రట్టు చేసారు. . ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
50 మంది చిన్నారుల అమ్మకం..(Child Trafficking Racket)
పిల్లల అమ్మ కాల వెనుక కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. అక్రమ పద్ధతిలో పిల్లలని కొనుక్కున్న వారిని గుర్తించి చిన్నారులను పోలీసులు రక్షించారు. 16 మంది పిల్లలను కాపాడగా మిగిలిన వారికోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు తల్లిదండ్రులు ఎవరనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా గుంటూరు, విజయవాడ, కరీంనగర్ ,సహా తెలుగు రాష్ట్రాల్లో పిల్లను కొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసారు. పూణే, ముంబై, ఢిల్లీ నుంచి పిల్లలను ఎత్తుకొచ్చినట్లు గుర్తించారు. మిగిలిన పిల్లలకోసం రాచకొండ కమీషనర్ ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు.