Site icon Prime9

Hyderabad Hotels: అధ్వాన్నంగా హైదరాబాద్ హోటళ్లు.. పుడ్ సేప్టీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన నిజాలు

Hotels

Hotels

Hyderabad Hotels: హైదరాబాద్‌ మహానగరంలో వారాంతాల్లో కుటుంబంతో సహా హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఫుడ్‌ సెఫ్టీ అధికారులు నగరంలోని పాపుల్‌ హోటల్స్‌పై తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో హోటల్‌ యజమానులు అస్సలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది.

పాచిపోయిన ఆహారం.. కుళ్లిన కూరగాయలు..(Hyderabad Hotels)

తాజాగా రాయలసీమ రుచులు, షా గౌస్‌ హోటల్‌లో పుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖి చేస్తే.. కళ్లు బైర్లు కమ్మేవాస్తవాలు వెలుగు చూశాయి. చింతపండు బూజు పట్టి పురుగులు తిరుగుతున్నాయి. ఎక్స్‌పైరీ డేట్‌ పాలను వినియోగిస్తున్నారు. వేజ్‌, నాన్‌ వెజ్‌ పుడ్‌ను ఒకటే చోట స్టోర్‌ చేస్తున్నారు. కిచెన్‌లో డ్రైనేజీ బ్లాక్‌ అయ్యి నీరు బైటికి పోకుండా నిలిచిపోయి ఉన్నాయి. పాచిపోయిన ఆహారం సర్వ్‌ చేయడంతో పాటు కుళ్లిపోయిన, పురుగులు పట్టిన కూరగాయాలతో కూరలు వండుతున్నారు. ఇక నూనె విషయానికి వస్తే వాడిని నూనెను మరిమరి వాడుతున్నారు. ఎక్కడ చూసినా ఒపెన్‌ డస్ట్‌బిన్‌లు కనిపిస్తున్నాయి. సిబ్బంది తలకు క్యాప్‌లు కానీ… గ్లౌజ్‌లు కానీ వినియోగించడం లేదు. ఇక మంచి నీరు చూస్తే..నాణ్యత లేదు. ఒపెన్‌ డ్రైనేజీ కిచెన్‌లు, ఎక్స్‌పైరీ ఫుడ్‌.. ఫంగస్‌తో కూడుకున్న కూరగాయాలు, లేబుల్‌ లేని ఫుడ్‌ ఐటమ్స్‌ అధికారులకు దర్శనమిచ్చాయి.

నిబంధనలకు నీళ్లు..

ఇవేవో గల్లీ హోటల్స్‌ అనుకుంటే పప్పులు కాలేసినట్లే.. హైదరాబాద్‌ నగరంలో అతి పెద్ద హోటల్స్‌ హై ఎండ్‌ కేఫ్‌లు, ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్లు, క్లబ్‌లు, పబ్‌లు అని కలిసి ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పెద్ద హోటల్స్‌లో నాణ్యత లేని ఆహారం వండి వండిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎంసీహెచ్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఈ హోటళ్లలో తనిఖీలు చేపడితే నిర్థాంతపోయే సీన్‌లు కనిపించాయి. చలావరకు పుడ్‌లో క్వాలిటీ పూర్తిగా లోపించింది. కిచెన్‌లు దుర్వాసన వెదజల్లుతున్నాయని, వంట పాత్రలు ముఖ్యంగా మాంసాహారం వండే పాత్రలు దుర్గంధం వెదజల్లుతున్నాయని అధికారులు తెలిపారు.

నిబంధనలు తుంగలో తొక్కిన హోటల్స్‌ విషయానికి వస్తే క్రీమ్‌ స్టోన్‌, నాచురల్‌ ఐస్‌ క్రీమ్‌, కరాచీ బేకరీ, కెఎఫ్‌సీ, రోస్టరే కేఫ్‌, హౌస్‌ రాయలసీమ, రుచుల్‌ షా, గౌస్‌ కామత్‌ హోటల్‌, 36 డౌనింగ్‌ బ్రూ పబ్‌, మకావ్‌ కిచెన్‌ అండ్‌ బార్‌, ఎయిర్‌ లైవ్‌, టాకోబెల్‌, ఆహా దక్షిణ్‌, సిజ్జల్‌ జో, ఖాన్‌సాబ్‌, హోటల్‌ సుఖ్‌సాగర్‌ వెజ్‌ రెస్టారెంట్‌, జుంబో కింగ్‌ బర్గర్స్‌, రతన్‌దీప్‌ రిటైల్‌ స్టోర్‌లున్నాయి.

Exit mobile version