Site icon Prime9

Wife caught Husband Red-handed: ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

Amberpet

Amberpet

Wife caught Husband Red-handed:  హైదరాబాద్ అంబర్‎పేట్ డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో ఉండగా భర్త ప్రవీణ్‎ను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎస్‎ఆర్‎టి కాలనీకి చెందిన ప్రవీణ్ గత కొంత కాలంగా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన భార్య అతన్ని ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

భార్య, పిల్లలపై దాడి..(Wife caught Husband Red-handed)

ప్రియురాలితో భర్త ఎంజాయ్ చేస్తుండగా.. భార్యా పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భర్త, అతని ప్రియురాలిపై భార్య మండిపడింది. దీంతో ఆంగ్రహించిన భర్త ప్రవీణ్ భార్య పిల్లలపై దాడికి దిగాడు. భార్య మెర్సీ ఆమె కొడుకుని భర్త ప్రవీణ్ తీవ్రంగా కొట్టాడు. ప్రవీణ్ ప్రేయసికి ముందే వివాహమైంది.. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా పోలీసులను భార్య మెర్సీ ఆశ్రయించింది. తను పని చేస్తున్న సంస్థలోనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆమె ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న అంబర్‎పేట్ పోలీసులు.. ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version