Laddu To Ayodhya Ram: అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 12:57 PM IST

LaddU To Ayodhya Ram: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేసే అవకాశం సికింద్రాబాద్ మారేడ్ పల్లి వాసి నాగభూషణం రెడ్డికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ దక్కించుకుంది. ఈ మేరకు 12వందల 65 కిలోల లడ్డూను, ప్రత్యేక వాహనాన్ని అయోధ్యకు పంపించడానికి సిద్దం చేశారు.

లడ్దూ శోభా యాత్ర..(LaddU To Ayodhya Ram)

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజు నుండి ఈరోజు వరకు 12వందల 65 రోజులు పూర్తి కావడంతో 12వందల 65 కిలోల లడ్డూను విగ్రహ ప్రతిష్ట రోజు ప్రసాదంగా పంచాలని నిర్ణయించామని నాగభూషణం రెడ్డి అన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి ఉదయం మారేడ్ పల్లిలోని తన నివాసం, సంతోషి మాత దేవాలయం వద్ద భక్తుల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం  రెండు గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి లడ్డూ శోభా యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గాన అయోధ్య చేరుకుంటుందని నాగభూషణం రెడ్డి తెలిపారు.