Drugs seized: హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు భారీగా మాదకద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టోలీచౌకిలో ముంబైనుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్‌ని పోలీసులు పట్టుకున్నారు. మఫ్టీలో మాటువేసి పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు ఎనిమిది పాయింట్ అయిదు ఆరు గ్రాముల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.
వనస్థలిపురంలో 50 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్..( Drugs seized)
ఇక మరో ఘటనలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో 50 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్‌ని సరూర్ నగర్ ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేరళకి చెందిన సుమేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరునుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకు వస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులోనే గతంలో కూడా సుమేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంకోవైపు కబాలి నిర్మాత కెపి చౌదరిని డ్రగ్స్ కేసులో కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని రెండు రోజులపాటు లోతుగా పోలీసులు ప్రశ్నించారు. సినీ పరిశ్రమకి చెందిన పలువురికి కెపి చౌదరి మాదకద్రవ్యాలు సరఫరా చేశాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా ప్రశ్నించారు. కెపి చౌదరి కస్టడీ ముగియడంతో ఇప్పుడు పలువురు ప్రముఖులకి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.