Kodali Nani: వైసీపీ నాయకుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు.
కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలి..(Kodali Nani)
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని.. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసింది. ఈ క్రమంలో కొడాలి నాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాసేపు జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసిన పార్టీ కార్యక్తలు ఆపై కొడాలి నాని ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకువన్ టౌన్ సీఐ శ్రీనివాస్, పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.