Site icon Prime9

TSPSC Group1Prelims: టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుటిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

TSPSC Group 1 Prelims

TSPSC Group 1 Prelims

TSPSC Group1Prelims:  టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు. అయితే ఓఎంఆర్ షీటుపై హాల్‌ టికెట్ నంబరు, ఫొటో ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది. గత అక్టోబరులో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదని హైకోర్టు అడిగింది. పరీక్షల్లో అక్రమాలని నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు నిలదీసింది.

అభ్యర్థులు అభ్యంతరం చెప్పలేదు..(TSPSC Group1Prelims:)

పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకి చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని టీఎస్పీఎస్సీ న్యాయవాది గుర్తు చేశారు. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫొటోకు సుమారు కోటిన్నర ఖర్చవుతుందని టీఎస్పీఎస్సీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా అభ్యర్థులను ఇన్విజిలేటర్లు ధ్రువీకరించారని టిఎస్‌పిఎస్‌సి వివరించింది.

పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యతని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణకోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Exit mobile version