mega888 Bail to YCP MLA Pinnelli: : ఏపీలో ఈ నెల 13న ఎన్నికల

Bail to YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట ..ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

: ఏపీలో ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే ,తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి హై కోర్ట్ లో ఊరట లభించింది .

  • Written By:
  • Updated On - May 24, 2024 / 01:31 PM IST

Bail to YCP MLA Pinnelli: ఏపీలో ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే ,తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి హై కోర్ట్ లో ఊరట లభించింది . జూన్ 6 వరకూ పిన్నెల్లి ని అరెస్ట్ చేయవద్దని హై కోర్టు సూచింది . ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల లోని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి ఈవీఎం ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే .ఈ సంఘటనను ఈసీ బాగా సీరియస్ గ తీసుకుని కేసు నమోదు చేయించింది .దింతో రెండు రోజులుగా అజ్ఞాతంలో వున్న పిన్నెల్లి బెయిల్ కోసం హై కోర్ట్ తలుపు తట్టారు .రెండు రోజుల నుంచి పిన్నెల్లి అరెస్ట్ కాబోతున్నారు అని మీడియాలో కధనాలు వచ్చాయి .ఇప్పుడు హై కోర్ట్ ఆదేశంతో దీనికి తెర పడినట్లయింది .

ఇతర నేతలకు కూడా ఉపశమనం..(Bail to YCP MLA Pinnelli)

అదే విధంగా ఏపీ వ్యాప్తంగా ఎన్నికల రోజు ,అనంతరం జరిగిన అల్లర్లు కొన్ని చోట్ల ఆటు వైసీపీ .ఇటు టీడీపీ నేతల పై కూడా కేసు లు నమోదు అయ్యాయి . వాళ్లకు కూడా ఈ సందర్భంగా హై కోర్ట్ ఊరట కలిగించింది . తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల తరఫున లాయర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.

బెయిల్  షరతులు ..

ఈ సందర్భంగా వీళ్ళందరికీ న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది . వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని స్పష్టం చేసింది సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపింది. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసిన కోర్టు.. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని అక్కడి టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షరతు విధించారు.