Police Case on Hero Raj Tharun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మీద ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
11 ఏళ్లుగా రిలేషన్ లో..(Police Case on Hero Raj Tharun)
తనను పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నమ్మించాడని ఇప్పుడు చేసుకోకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాడని ఇప్పుడు దూరం పెట్టాడని ఫిర్యాదులో లావణ్య తెలిపారు. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేకసార్లు బెదిరింపులకు గురిచేశారని కూడా ఫిర్యాదులో తెలిపారు.రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన లావణ్య..
ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన నార్సింగ్ లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అనే విషయం ఒకసారిగా తెర మీదకు వచ్చింది. ఈ డ్రగ్స్ కేసు గురించి కూడా లావణ్య ఫిర్యాదులో వివరించారు. తనను కావాలనే కొంతమంది ఈ కేసులో ఇరికించారని తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. తాము గుడిలో పెళ్లి చేసుకున్నామని ఆమె చెబుతున్నారు. అయితే గత కొంత కాలంగా.. తనను కాదని.. తన సినిమాలోని ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుననాడని.. ఆ తర్వాత నన్ను వదిలేశాడని ఫిర్యాదులో తెలిపారు. తాను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నానని, ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు అని ఆమె ఫిర్యాదులో వాపోయారు.