Site icon Prime9

Hero Mohan Babu: బుద్దిలేదా అంటూ మీడియాపై హీరో మోహన్ బాబు చిందులు

Hero Mohan Babu

Hero Mohan Babu

Hero Mohan Babu:  సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ లో మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు.

లోగోలు లాక్కోండి..(Hero Mohan Babu)

మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు లాక్కోండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు చర్చనీయాంశం అయింది.

 

Exit mobile version