Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి సీతారామ చంద్రస్వామివారి ఆలయ పరిసరాలన్నీ నీట మునిగాయి. అన్నదాన సత్రంతో పాటు ఆలయ పరిసరాల్లోని వ్యాపార సముదాయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. గోదావరి కరకట్టకు అమర్చిన స్లూయిజ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో డ్రైనేజీ నీటితో ఆలయ పరిసరాలన్నీ నీట మునిగిపోయాయి. దీనితో అటు స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్ల చుట్టూ వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.