Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటలు పడుతుంది . శుక్రవారం రద్దీ మరి ఎక్కువైంది . వారాంతరం కావడంతో రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. భక్తులతో తిరుమల కిటకిట లాడుతుంది .రూమ్ లు కూడా పూర్తిగా నిండిపోయాయి .షాపింగ్ కాంప్లెక్స్ లలోను భక్తులు రద్దీ పెరిగింది . క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ శని ,అదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది .
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..(Tirumala)
విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం ,మరో వైపు పోలింగ్ ప్రక్రియ పూర్తవడం, పది ,ఇంటర్ విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30-40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది . భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు వారాంతాల్లో అంటే శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.