Site icon Prime9

Chandrababu’s Petition: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu's Petition

Chandrababu's Petition

Chandrababu’s petition: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం దీనిని మరో బెంచ్ వద్దకు బదిలీ చేసింది. ధర్మాసనం లోని జడ్జి ఎస్వీ భట్టి ఈ కేసు విచారణకు విముఖత చూపారు. చంద్రబాబు పిటిషన్ పై నాట్ భిపోర్ మిఅని స్పందించారు. అయితే దీనిపై చంద్రబాబు లాయర్లు చీఫ్ జస్టిస్ ను రిక్వెస్ట్ చేయడం, ఆయన అంగీకరించడంతో వాదనలు ప్రారంభమయ్యాయి.

ఎస్వీ భట్టి 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసారు. జూలై 14 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేసు కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ఆయన ప్రకటించారు. జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని మరో జడ్జి ఖన్నా అన్నారు. దీనితో కేసు మరో బెంచ్ కు బదిలీ అయింది.  అయితే చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్ద లూద్రా  చీఫ్ జస్టిస్ ను రిక్వెస్ట్ చేయడం, ఆయన అంగీకరించడంతో వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలనేది తాము కోరుతున్నామని చంద్రబాబు లాయర్లు తెలిపారు. అనంతరం చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ  మంగళవారానికి వాయిదా వేసారు.

ఉండవల్లి కేసు పై కూడా..(Chandrababu’s petition)

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుని సిబిఐకి అప్పగించాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌ని వేరే బెంచ్‌కి బదిలీ చేశారు. ఇవాళ కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఈ పిటిషన్‌ విచారణకి వచ్చింది. దీంతో న్యాయమూర్తి రఘునందన్ రావు నాట్ బిఫోర్ మీ అన్నారు. ఈ పిటిషన్‌ని వేరే బెంచ్‌కి బదిలీ చేయాలని జస్టిస్ రఘునందన్ రావు హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీనితో ఈ కేసుని ఏ బెంచ్‌కి బదిలీ చేస్తారు.? ఎప్పడు విచారణ ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

బుద్దా వెంకన్న సహా 26మందికి నోటీసులు..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అరెస్టు అనంతరం హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏజీ వినిపించిన వాదనలతో సంతృప్తి చెందిన హైకోర్టు.. టిడిపి నేత బుద్దా వెంకన్న సహా 26మందికి నోటీసులివ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించింది.

Exit mobile version