Hariramajogaiah:మాజీ ఎంపీ ,కాపు ,బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు.వైసీపీ కానీ , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కానీ తమ ఎన్నికలు మేనిఫెస్టోలలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన 5 శాతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలుగచేసే అంశం లేకపోవటం దురదృష్టకరమని అన్నారు . అన్ని పార్టీలు కాపులు పట్ల చిన్నచూపు చూడటం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు .గత కొంత కాలంగా జోగయ్య కాపుల సంక్షేమం కోసం పట్టు పడుతున్నారు .వైసీపీ వ్యతిరేకిస్తూ కూటమికి మద్దతు పలికారు .కాపులకు ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని జనసేన అది నేత పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి లేఖలు రాస్తూనే వున్నారు .
జనసేన ,టీడీపీ ,బీజేపీ కూటమి కట్టిన తర్వాత కూడా లేఖలు రాసారు .కాపులకు అది కారంలో తగిన ప్రాధాన్యత లభించకపోతే ఓట్లు బదిలీ కావని కూడా హెచ్చరించారు .పవన్ కళ్యాణ్ కు హోమ్ ,రెవిన్యూ శాఖలు అప్పగించాలని కూటమికి సూచించారు .జోగయ్య లేఖలను ఎవరు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం .అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు జోగయ్య .ఆ క్రమంలోనే తాజాగా మరో లేఖ రాశారు .కాపులకు రిజర్వేషన్స్ పై ఏ పార్టీ కూడా స్పష్టమయిన హామీ ఇవ్వక పోవడం పై ఆవేదన వ్యక్తం చేసారు.