Harirama jogaiah: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు.
50 నియోజకవర్గాలలో ..( Harirama jogaiah)
తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీచేయాలని తెలిపారు. అలాగే 50 నియోజకవర్గాలలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలో సూచించారు. పవన్ కళ్యాణ్‌కు మూడు నియోజకవర్గాలను హరిరామజోగయ్య సూచించారు.నర్సాపురం, గాజువాక, తిరుపతి నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేయొచ్చని చెప్పారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలన్నారు. తన లేఖలో లేఖలో 50 నియోజకవర్గాలకు అభ్యర్థులను సూచించారు హరిరామ జోగయ్య. ఇటీవల పవన్ ను కలిసిన తరువాత హరిరామ జోగయ్య లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సీఎం పదవి షేరింగ్ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెడితే టీడీపీ- జనసేన కూటమి గెలుపు ఖాయమని చెప్పారు.